Book Description
మనిషిని కాల్చేసే బాధలుంటాయి. మనిషిని పీల్చేసే బాధలుంటాయి. మనిషిని తొలిచేసే బాధలుంటాయి. ఎంతోమంది నరకం అనుకుంటూ అనుభవించేదీ, విముక్తి పొందుదామని అనుక్షణం తపిస్తూ తప్పించుకోలేనిది, అడుగడుక్కీ నసలతో నలిగిపోయేది కటుంది - అది సమిష్ఠి కుటుంబాల అంతర్ఘోష! కలిసి వుంటూ ఒకర్నొకరు భరించలేకుండా వుంటూ, ఒక చూరు కింద బ్రతుకుతూ, నిరంతరం దోషాలనే వెదుక్కుంటూ, ప్రేమ వుండవలసిన చోట ద్వేషం, అనురాగం వుండవలసిన చోట వంచన, ఆత్మీయత కావలసిన చోట అసూయ, అసహ్యమైన నిశ్శబ్దంలాంటి భయంకర రణగొణధ్వని, విసుర్లు, కసుర్లు, విరుపులు, అరుపులు అసలు విషయం క్రకక్కలేక మరో రూపంలో బయటపడే ఆక్రందనలు మంచి మనుషుల్ని కూడా వికృతంగా చాటే వికారాలు.... ఈ నిజాల నిజరూప దర్శనమే - ‘ఈ దేశంలో ఒక భాగమిది.’