Book Description
“మీ కోర్టులంటే భయం బాబూ!ఒక్కొక్క కేసు నెలలు,సంవత్సరాల తరబడి నడుస్తుంది.మీలాయర్లు కూడా క్లయింట్ని ఇబ్బంది పెట్టేస్తూ వుంటారు.వున్నవీ లేనివీ కల్పించి…..” అంది డాక్టర్ మాలతి.“మీ డాక్టర్లు మాత్రం తక్కువ తిన్నారా?…పేషెంటు జబ్బు గురించి కంటే డబ్బు గురించి ఎక్కువ ఆలోచించటం లేదా?”అసలీ మధ్య పేపరులో ఎన్ని వార్తలొచ్చాయి? రోగి ఇంకా కొనఊపిరితో ఉండగానే చనిపోయాడని బెడ్ ఎక్కించే అవసరమున్నా పట్టించుకోకుండా చివరికి ముంచుకు వచ్చి రోగి ప్రాణాన్ని కాపాడులేక పోయారనీ…”అన్నాడు లాయర్ ప్రదీప్నాణెమే న్యాయంగా చెలామణి అవుతున్న ఈ వ్యవస్థలో – నాణేనికి అటూ-ఇటూ తలా తోకా ఉన్నాయి.మరి న్యాయానికి అటూ-ఇటూ ఏమున్నాయో తెలుసుకోవాలంటే…న్యాయానికి అటూ-ఇటూచదవాల్సిందే!