Book Description
బసవయ్య ఎవరు? పరమశివుడెవరు? - ఇదే వీరశైవ మతాచార తత్త్వం. భగవంతునికి సృష్టి స్థితి లయలా!! గాలిలో సుడిగాలిపుట్టి, ఆ గాలిలో కలిసిపోదా, ఆకాశంలో మెరుపు మెరిసినట్లే మళ్లీ ఆకాశంలో కలిసిపోదా- పరమలింగంలో కలిసిపోయిన లింగతత్త్వమే బసవయ్య అంటూ బసవని తల్చుకు నమస్కరించారు. ఆ భక్తాగ్రగణ్యులు. భక్తి హితార్థమై ప్రభవించిన శివాంశే కదా మన బసవేశ్వరుడు అంటూ వివిధ విధాల బసవేశ్వరుని కీర్తించారు భక్తులు. గుడి అంతా ‘బసవా... బసవా’ అంటూ ప్రతిధ్వనించింది. ‘చూసావా, నాకూ నందీశ్వరునికి అబేధమన్నాను - నిజమేనా, అన్నాడు కైలాసంలో పరమశివుడు పార్వతిని క్రీగంటచూస్తూ. ‘అవును స్వామీ’ అంటూ మందస్మితం చేసింది పార్వతి.