Book Description
ఎవరైనా తనని అలా చూస్తూండిపోతే యశస్వికి నచ్చదు. కానీ విష్ణు తనని అలా చూస్తుంటే మాత్రం ఆమెకి ఒక చిత్రమైన ఫీలింగ్ కల్గింది. తనని ఎందుకంత ఇష్టంగా చూస్తాడు? ‘పుష్పం సమర్పయామి’ అంటూ ఒక్కో పుష్పాన్ని తన మీదకి ఆరాధనగా మునివేళ్ళతో వేస్తోన్న ఫీలింగ్ ! నిజం! అతని చూపులు పుష్పాలై తనని స్పర్శిస్తున్నాయ్! ఆ చూపులు చూస్తే గుండె గొంతుకలోకి వచ్చి తీసుకుంటున్న ఊపిరికి అడ్డం పడ్తుంది! అతనివైపు చూడకుండా ఉందామా అంటే గుండె కొట్టుకోదు. ఎలాగబ్బా?