Book Description
ఎంత పిచ్చిది తను? ఎందుకేడుస్తూంది? ఏడ్చే అధికారం ఎక్కడిది తనకు? మాధవకు తనెవరినని సరళ మీద ఈర్ష్యపడగలదు? అనుకుంది వ్యథిత హృదయ జానకి. ఇదేమిటని అడగాలా? ఏ మొహం పెట్టుకొని అడుగుతుంది? ఎవరిని చేసుకొన్నా తన అభ్యంతరం ఉండదని వాగ్దానమిచ్చి ప్రాధేయపడి మెడలో తాళి కట్టించుకొని, ఇప్పుడు సంజాయిషీలు అడగగలదా? మరి, మాధవ తనపై చూపిస్తున్న మక్కువ?