Book Description
డా।। విక్రం తన ప్రయోగాల మీద వ్రాసిన పేపర్ ఒక మెడికల్ మేగజైన్‍లో పబ్లిష్ అయింది. ఆ తర్వాత దానిమీద ప్రశంసలు వచ్చాయి. ఎవరీ తపస్వి? ప్రతిభాశాలి... పరిశోధనాశాలి. తనను ఎదుర్కొంటున్న అజ్ఞాన వాహినికి ఎదురొడ్డి నిలిచిన జ్ఞాని. ఎలాంటి ఆటంకాలలోనయినా తన పరిశోధన ఆపని స్థిర సంకల్పుడు. ఎవరికీ తలవంచని - ఎవరినీ ఆశ్రయించని ధీరుడు! ఇలాంటి వ్యక్తి పరిశోధన ఫలించక ఏమవుతుంది? ఈరోజు నిన్ను వెక్కిరించిన వారందరూ పరమ పవిత్రులూ, ఏ మచ్చాలేనివారంటావా? ఈ సమాజపు తీరే విచిత్రమైనది. పబ్లిక్ సీక్రెట్స్ చక్కగా కడుపులో దాచుకుంటుంది. స్పష్టంగా తెల్సిపోతున్న విషయాలను కష్టపడి నమ్మకుండా ఉండడానికి ప్రయత్నిస్తుంది. ధైర్యంగా తన కట్టుబాట్లను ఎదిరిస్తే మాత్రం సహించదు. ఇదంతా ముందుగా ఊహించిందేగా! ఇంత కృంగిపోతే ముందేం సాధించగలవు? తను మనసారా ప్రేమించిన రాజారామ్‍కు కర్తవ్యాన్ని బోధించిన ‘‘అనిత’’ గాధ.