Book Description
మనిషికి ఏంకావాలి? ప్రేమకావాలి, అనుభవం కావాలి, ఆనందం కావాలి. వీటికోసం అన్వేషిస్తూనే ఉంటాడు. కానీ నిత్యజీవితంలో అవి దొరుకుతున్నాయా? ఈ జీవితంలో ఏముంది? సమస్యల మయం. పుడుతూనే చదువు, ఉద్యోగం, పెళ్ళి, సంసారం.... చేసిందే చెయ్యటం, తిన్నదే తినటం..... ఎంత నిస్సారం! మరి ప్రేమ, ఆనందం ఎలా దొరుకుతాయి? దొరుకుతాయి! అది మన సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి అనుభవాన్ని ఎలా అర్థం చేసుకుంటావు? ప్రతి సమస్యని ఎలా ఎదుర్కొంటావు? అనుక్షణం నీతో సంబంధం ఉన్న మనుష్యులతో ఎలా ప్రవర్తిస్తావు? నీ సంస్కారమే నీకు ఆనందాన్ని ఇస్తుంది. లేదా దూరం చేస్తుంది. దుఃఖాన్నిస్తుంది. అది తెలుసుకుంటే జీవితం ‘పాడుతా తీయగా’ అనిపిస్తుంది. అవుతుంది!