Book Description
జీవితం చిన్నది - పెను తుఫానులకు, ఆటుపోటులకు తట్టుకొని సముద్రములో ముందుకుపోయే నావలాగ జీవితాన్ని కూడా చక్కని మార్గంలో సాగిపోయేలా చేసుకోగల్గినవారే ధన్యులు. అలాంటికోవకు చెందుతారు ఆనంద్, కేశవమూర్తి. రామలక్ష్మణుల్లాంటి వారిరువురు సొంత అన్నదమ్ములు కాకపోయినా విధివశాత్తు సోదరులుగా చేరువవుతారు. కేశవమూర్తి భార్య జానకికి, పినతండ్రి కూతురు, గీత ఆనంద్ జీవితంలో భాగస్వామిని కావలెనని ఆకాంక్షిస్తుంది. గీత అందాల భరిణి, చదువుకున్నది. ఆనంద్ కూడా విద్యావంతుడు, అందగాడు. గీతకు ఆనంద్ పట్ల ఆరాధన వున్న, అతడు చేసే కొన్ని పనులు ఆమెకు గిట్టవు. ఆనంద్ యివేమి లెక్కచేయడు. అలాంటి వారిద్దరి మధ్య పొత్తు కుదురుతుందా? గీత ప్రేమ ఫలిస్తుందా? తన అన్న కేశవమూర్తి చూసిన వేరే సంబంధం కాదని ఆనంద్ గీతను పెళ్లి చేసుకుంటాడా? ఈ ప్రశ్నలకు జవాబుగా రచింపబడిన నవలే ఈ ‘‘జీవితం చిన్నది’’.