Book Description
ప్రపంచంలో నాలుగు ప్రధాన అంశాలపైనే ఎక్కువగా చర్చ జరుగుతోందని యునెస్కో ఆధ్వర్యంలో జరిగిన ఒక సర్వే తేల్చింది. రాజకీయాలు,సినిమాలు,క్రీడలు, చదువులు. భారత్‌లోనూ 1966 తర్వాత విద్యారంగం ముఖచిత్రం మారిపోయింది. ఉన్నత విద్యకు చేరుకుంటున్న విద్యార్థుల విద్యావసరాలు తీర్చలేక ప్రభుత్వాలు ప్రైవేటు సంస్థలను పరోక్షంగా ప్రోత్సహించడంతో కార్పొరేటీకరణ మొదలైంది. క్వాలిటీ విద్య పేరుతో లక్షలాది ఫీజులు వసూలు చేయడం, దానికి తగ్గట్టే మంచి ఫలితాలు కూడా రావడంతో ప్రైవేటు సంస్థలు దూసుకువెళ్లాయి. ఒక దశలో వాటిని ఆపే ప్రయత్నం చేస్తే ఆ సంస్థలే అధికారులను, మంత్రులను మార్చగలిగే స్థాయికి ఎదిగాయి.