Book Description
గణితశాస్త్రం (Mathematics) అనగానే చాలామంది రకరకాల సూత్రాలు, ఫార్ములాలతో ముడిపడిన కఠినమైన సంఖ్యాశాస్త్రంగా భావిస్తారు. కాని గణితమంటే ఒక ఆలోచనా సాధనం. మనిషి ఆలోచనలకు మెరుగులద్దే సామర్థ్యం గణితశాస్త్రానికి ఉంది. అందుకే అన్ని శాస్త్రాలకు మూలాధారంగా గణితశాస్త్రాన్ని చెబుతారు. గణితంపై సరైన పట్టు రాకపోతే శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించడం కష్టం. నేటి ‘సైంటిఫిక్’ యుగంలో పిల్లలకు గణితంపై ఎంతమంచి అవగాహన ఏర్పడితే ఆయా కోర్సులలో అంత బాగా రాణిస్తారు. చిన్న వయసులో లెక్కలపట్ల ఆసక్తిని కలిగిస్తే, పై తరగతుల్లో ఏ సమస్యలనయినా అవలీలగా సాధించగలుగుతారు. గణితాన్ని ఒక సులభమైన విషయంగా చూడగలుగుతారు.