Book Description
కొందరిది డేగ చూపు. చమత్కారవాసన తగిలితే చాలు - ఒడిసి పట్టుకుంటారు. కొందరు రేజీకటివాళ్ళు వున్నా చమత్కారం పట్టుకోలేక తడుముకుంటారు. శ్రీరమణ చూపు డేగ చూపు. ఏ చమక్కూ, చమత్కారమూ అతన్ని తప్పించుకు పారిపోలేవు. తెలుగులో ప్రసిద్ధ హాస్యరచయితల తరువాత యువతరంలో ముళ్లపూడి మార్కు హాస్యం ఒకటి లోకాన్ని కలకల నవ్వించింది. తర్వాతది శ్రీరమణీయ హాస్యం. ఉదీయమానంగా తలయెత్తి ఎంతో ఆశ గొలుపుతున్నది. అది ముప్ఫై రువ్వులుగా - అరవై నవ్వులుగా పెరగాలని నా కోరిక. ఈ రసగుళికలకు తన గుడుసుకుంచెతో రెట్టింపు రుచి తెచ్చిన సిద్ధహస్తుడు బాపుగారు - నిజానికి బాపు కాదు, రసరంజిత హృదయాలకు ‘ప్రాపు’ ఆయన! ఇక రంగంలో ప్రవేశించండి రసజ్ఞులు.