Book Description
రెండు సహస్రాబ్దాల క్రిందట దక్షిణభారతదేశంలో విశాల సామ్రాజ్యాన్ని స్థాపించిన ఆంధ్ర రాజవంశం శాతవాహనులు. ఈ వంశంలో సుమారు 30మంది రాజులు 450 సంవత్సరాలకు పైగా పరిపాలించినట్లు పురాణాలు తెలుపుతున్నాయి. శ్రీముఖ శాతకర్ణి, మొదటి శాతకర్ణి, పులోమావి, గౌతమీపుత్ర శాతకర్ణి, గౌతమీపుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణి వంటి గొప్ప రాజులు శక, యవన, పహ్లవులను ఓడించి సువిశాల సామ్రాజ్యాన్ని నిర్మించారు. దక్షిణాపథపతులు, త్రిసముద్రాధిపతులు, ఏక బ్రాహ్మణులు వంటి బిరుదాలను ధరించిన శాతవాహన చక్రవర్తులు ఆంధ్ర శిల్ప కళా వైభవానికి, సంస్కృతీ వైభవానికి ప్రతీకలు. శాతవాహన వంశ స్థాపన, కాలం, పరిపాలన గురించిన అనేక విశేషాలను తెలిపే పుస్తకం 'శాతవాహన చరిత్ర'.