Book Description
‘‘తల్లిదండ్రులను తాము విద్యార్థులుగా వున్నప్పుడు తీర్చుకోలేని కోరికలను, సాధించలేని స్థానాన్ని తమ బిడ్డలు సాధించాలని ఆశిస్తారు. తపన పడుతుంటారు. ఆ పిల్లల అంతర్ మనస్సుకు తెలుసు ఆ కోర్కెలు తమవి కాదని, తమ తల్లిదండ్రులవని. అంతేకాదు అవి తమ తల్లిదండ్రుల కోర్కెలు కూడా కావు. వాళ్ళ అమ్మనాన్న కోరుకున్నపని. వాటిని తన తల్లిదండ్రులు నెరవేర్చలేక తనపై ఆ బాధ్యతలను మోపారని అర్థమయిన ఆ చిన్నారి మనసు తాను పెద్ద అయినాక ఆ బరువు బాధ్యతలను, కోరికలను తిరిగి తమ పిల్లలకు బదలాయిద్దాం అనే చూస్తుంది. తాను సాధించే ప్రయత్నం చేయదు’’ అని మానసిక నిపుణులు విశ్లేషించారు. పిల్లల వాస్తవ స్థితిగతులను, మానసిక ధోరణిని గమనించకుండా వాళ్ళు ఇన్ని మార్కులు తెచ్చుకోవాలి. ఇలా తయారుకావాలని మీ ఆశలను, అభిప్రాయాలను వాళ్ళ నెత్తిన పెట్టడం సరైన పనికాదు. వాళ్ళ మానసిక వాస్తవాలకు, మీ ఊహాలకు, దూరం ఎక్కువగా ఉంటే పిల్లలు మానసిక ఒత్తిడికి గురౌతారు. డిప్రెషన్‍కు లోనవుతారు. ఆత్మన్యూనతా భావంతో పెరుగుతారు. లేదా తప్పులు చేస్తూ అడ్డదారిలో తల్లిదండ్రుల ఊహలస్థాయికి రావడానికి పథకాలు వేస్తుంటారు. కారెక్టర్ లేనివారుగా మార్పు చెందుతారు.