Book Description
వత్సరాజైన ఉదయనుడు, అతని కుమారుడు నరవాహనదత్తుల అద్భుతగాథ ఇది. ఈ ప్రధాన కథల్లో కథలో కథ, కథలో కథగా అసంఖ్యాక కథలల్లాడు కవి. వేల పౌరాణిక, చారిత్రక, సామాజిక పాత్రలతో నవరస భూయిష్ఠమైన ఇతి వృత్తాలతో, మనోహరమైన వర్ణనలతో, ఆకాశగమన, పరకాయ ప్రవేశాది అద్భుతాలతో చిత్ర విచిత్ర సన్నివేశాలతో అల్లిన ఈ బృహత్కథ ఆరంభం నుండి ముగింపువరకు పాఠకుణ్ణి కట్టిపడేస్తుంది. అద్భుతకథా ప్రధానాలైన గ్రంథాలన్నీ దీనిముందు మహాసాగరం ముందు పిల్ల కాలువల్లా కనిపిస్తాయి. అనేక కథాసరిత్తులు వచ్చి చేరి సంపన్నమైన సాగరంగా భావించాడు కాబట్టే సోమదేవసూరి దీనికి, కథాసరిత్సాగరమన్న అన్వర్థనామకరణం చేశాడు.