Book Description
ప్రపంచ సాహిత్యంలోనే ప్రాచీనమైన మహేతిహాసాల్లో ఒకటి వ్యాస మహాభారతం. ఈ ఇతిహాసంలో మన ఊహకు అందే మానవ సహజమైన ప్రతి భావోద్వేగమూ – ప్రేమ, అసహ్యం, ఈర్ష్య, అసూయ, ప్రతీకారం, ద్రోహం, వాత్సల్యం, క్షమ – వర్ణితమైంది. మహాభారతం కేవలం ఒక యుద్ధగాథ మాత్రమే కాదు. మానవ అస్తిత్వాన్ని గురించిన అద్భుతమైన ఆలోచనలతో నిండి ఉందది. శివ్ కె.కుమార్ ఈ మహేతిహాసాన్ని అద్భుతమైన నవలగా మలిచారు.