Book Description
అసలేం జరిగిందంటే…’ అన్నది నా అనుభవాల సమాహారమే తప్ప నా స్వీయచరిత్ర కాదు. ప్రభుత్వాన్ని బయటనుంచి చూసేవాళ్ళకి విశాలమైన బంగళాల్లో నివసిస్తూ, ఎయిర్ కండిషన్డ్ కారుల్లో తిరిగే ఐఏఎస్ అధికారుల జీవితాలు అత్యంత సుఖవంతంగా ఉన్నట్లు అనిపించడం సహజం. పాలనావ్యవస్థలోని కల్మషాన్ని కడిగి పారేసి, సంస్కరించి పారేయాలన్న వీరావేశంతో ప్రభుత్వ సర్వీసుల్లోకి ప్రవేశించే యువతీ యువకులకి ఆరంభంలో ఆవేశం, ఆత్మవిశ్వాసం అపరిమితంగా ఉండటం సహజం.