Book Description
తెలుగు అనువాదం :- కాకాని చక్రపాణి, ఎ.వి. పద్మాకర్ రెడ్డి, పద్మిని భావరాజు, సుధాకర్ హిమాలయాల తీర్థాలన్నింటిలోనూ అతిపవిత్రమైన తీర్థక్షేత్రాలు - కైలాసం- మానసరోవరమునూ... ఈ తీర్థక్షేత్రాల పరిసరాల్లోకి ఎవరు ప్రవేశించినా మతంతోగానీ, జాతితోగానీ సంబంధం లేకుండా, నాస్తికుడైనా సరే, ఆస్తికుడైనాసరే అనివార్యంగా, తనకు తెలియకుండానే, తన ప్రమేయం ఇసుమంతయినా లేకుండానే, ఈ అనంత విశ్వాన్ని వెనుక నుంచి నడిపిస్తోన్న ఒకానొక అదృశ్యదివ్యశక్తి వెన్ను తట్టి ప్రోత్సహిస్తుండగా, ఒక మరపురాని దివ్యానుభూతికి లోనవడం ఖాయం! అదే ఒక నిజాయతీ గల సాధకుడైతే నేరుగా ఆ మహాపారవశ్యాన్ని అనుభవించగలుగుతాడు. అయితే ఇందులో గమనించాల్సిన విషయం... ఆ ప్రదేశప్రత్యేకతను ఆస్వాదించడానికి ఒకానొక మానసికసంసిద్ధత అక్కడికెళ్లే వ్యక్తికి లేదా వ్యక్తులకు ఉండి తీరాలి. టీవీని శాటిలైట్‌తో అనుసంధానించడం, కావాల్సిన ఛానెల్‌ని ట్యూన్ చేసుకోవడం జరిగిన తర్వాతే కదా సదరు ఛానెల్‌లోని కార్యక్రమాల్ని వీక్షించగలుగుతాం. పుణ్యక్షేత్రాల సందర్శనానిక్కూడా అలాంటి శాటిలైట్ లింకేజీ, ట్యూనింగ్‌లాంటి మానసికసంసిద్ధత అవసరమన్నమాట.