Book Description
జైమిని వ్యాసశిష్యుడైన మహాతపస్వి, మహామేధావి, మహాపండితుడు. ఎంతటి మహాత్ముడంటే, తన గురువైన వేదవ్యాసులవారే ఈయన్ని విష్ణు పురాణంలో - ‘‘సామగో జైమినిః కవిః’’ అని మెచ్చుకున్నారు. అంటే సామవేదాధ్యయనం చేసిన మా జైమిని మంచి కవి అని గురువుగారే ఈయనకు మంచి సర్టిఫికెట్ ఇచ్చారు. ఈయన కేవలం సామవేదం ఒక్కటే చదువుకున్నాడని అనుకోకూడదు. ఆయన చతుర్వేదాలు, శిక్షాదిశాస్త్రాలు, సమస్తవిద్యలు ఆపోశనం పట్టిన మహామేధావి.