Book Description
సామాన్యుడు లేదా పామరుడు అర్థం చేసుకోగలిగింది కథ, వాచ్యంగా చెప్పినది. ప్రతీకలనుపయోగించి కథ చెప్తే ప్రతీకలను గుర్తించలేకపోతే పాత్రలను, ఘటనలను వాస్తవాలుగా భ్రమపడి అపార్థం చేసుకొనే ప్రమాదం ఉంటుంది. సామాన్యుల కోసమే ఉద్దేశించిన పురాణసాహిత్యంలోనూ ఈ ప్రమాదం ఉంటుంది. గోపికలు - శ్రీకృష్ణుని రాసక్రీడా ఘట్టం శ్రీమద్భాగవత పురాణంలోనిది. కేవలం వాచ్యస్థాయిలోనే అర్థం చేసుకొనేవారికి ఇదంతా అసభ్య శృంగారంలా గోచరిస్తుంది. మూలగ్రంథంలో ఎన్ని సూచనలున్నప్పటికీ సాధారణ పాఠకుడు మౌలికార్థాన్ని అర్థం చేసుకోవడం కష్టమే. అందుకే దానికి వ్యాఖ్యానాలు అవసరమవుతాయి. లేకపోతే పురాణేతిహాసాలలోని కథాఘట్టాలను నేటిసామాజిక దృష్టితో చూసి విమర్శించే అవకాశాలెన్నో ఉన్నాయి.