Book Description
ధర్మం అంటే ధరించి ఉంచేది, అనగా సమాజం విడిపోకుండా జాగ్రత్తగా పట్టి ఉంచేది. ‘ధారణాత్ ధర్మ ఉచ్యతే’ అని దీన్నే సంస్కృతంలో అంటారు. విడిపోకుండా ఉండాలంటే కొన్ని కట్టుబాట్లు, నియమాలు అవసరం. ఆచార వ్యవహారాలు ఒక పద్ధతి ప్రకారం ఉండాలి. అంతేకాక దేవుడు, స్వర్గం, నరకం ఇట్లాంటి విశ్వాసాల గురించి ఒకే విశ్వాసముండాలి. వీటన్నింటినీ కలిపితే ధర్మం అవుతుంది. అంటే మతమనేది కూడా మన సనాతన ధర్మంలో ఒకభాగంగా చెప్పబడిందే.