Book Description
విష్ణుసహస్రనామంలో కొన్నిపేర్లు రెండుసార్లు, మూడుసార్లు, నాలుగుసార్లు కూడా వస్తాయి. కాని శ్రీలలితా సహస్రనామంలో ఏ నామమూ రెండోసారిరాదు. దీనికి కారణం శ్రీసహస్రికలోని శాస్త్రీయపద్ధతి. దీన్ని రహస్య నామసహస్రం అనడం సమంజసమే. ఎందుకంటే మంత్ర, తంత్ర, యోగ, దర్శన శాస్త్రాల రహస్యమయ విషయాల మార్మిక సంకేతాలిందులో లభిస్తాయి. శరీరంలోని మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞాచక్రాల స్థితి, మహత్వాల సుందర, సారగర్భిత వ్యాఖ్య దేవీ నామావళి ద్వారా మనకు ఇందులో లభిస్తుంది. స్థూల దృష్టికి ఈ విభిన్న చక్రాలు గోచరించవు. ఆంతరిక, సూక్ష్మదృష్టితో ఆత్మనిరీక్షణ చేసినప్పుడే వీటి ఆధ్యాత్మిక స్వరూపం అర్థమవుతుంది. ఈ రహస్యాన్ని అర్థం చేసుకోవడంలో లలితా పరమేశ్వరి శ్రీసహస్రిక ఎంతో తోడ్పడుతుంది.