Book Description
ఈ లోకంలోకి వ్యక్తి వచ్చేటప్పడే తాను తెచ్చుకోగలిగేవి తెచ్చుకుంటాడు. తన భవిష్యత్తును తాను నిర్ణయించుకుని ప్రత్యేక కుటుంబంలో వారి పూర్వకర్మలను అనుసరించిన హోదా గౌరవాలు కలిగిన సమాజంలో జన్మిస్తాడు. తాను పుట్టిపెరిగిన సమాజ వ్యవహారాలన్నీ పూర్వకర్మ సంబంధాలే. కుటుంబం, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెండ్లు, సంతానం, బంధువులు, కళత్రం ఎవ్వరినీ మనం మార్పులు చేసుకోలేం. తమ శరీరాన్ని కూడా తాము పొందదగినదే పొందుతారు. చేసిన పాపపుణ్యాల ఆధారంగానే శారీరక, మానసిక లోపాలు ఏర్పడుతుంటాయి. వీటన్నింటినీ కర్మసిద్ధాంతం తెలియజేస్తుంది. అయితే వీటికి సంబంధించిన కొంత ప్రత్యేక సమాచారాన్ని ముందుగా గమనించడానికి, మనకున్న అన్ని శాస్త్రాలలో జ్యోతిషం ఒక్కటి మాత్రం ప్రత్యేకంగా వినియోగపడుతుంది. రాశి భావ గ్రహ స్థితి గతులను ప్రత్యేకంగా గమనించడం ద్వారా గుణదోషాలు సమగ్రంగా అధ్యయనం చేసి, పూర్వకర్మ లోపాలను సరిదిద్దడానికి అవకాశం కలుగుతుంది.