Book Description
”నువ్వు సంసార జీవితానికి పనికి రావు.వాడిని కూడా ఆ సుఖానికి దూరంగా ఉండమనటం న్యాయం కాదు!””నేను-నేను ఆమాట ఎప్పుడూ అనలేదు అత్తయ్యా!” రుక్మిణి కంఠం కంపిస్తున్నట్టుగా,నూతిలోనుంచి మాట్లాడుతున్నట్లుగా ఉంది.”నువ్వువాడితో అనటం లేదు.నిజమే! కానీ చేస్తున్న పని అదేగా. వాడంతట వాడు ఏ నిర్ణయం తీసుకోడు.నిన్ను అన్యాయం చేస్తానేమో అనే శంక వాడిని పీడుస్తుంది.ఎన్నాళ్ళని వాడిని వుండమంటావు?”రుక్మిణి నోట మాట రానట్టు వూరుకుంది.”వాడు నీమీద ప్రేమాభినాలతో ఇన్నాళ్ళు వూరుకున్నాడు.ఇంకే మగాడిలా వూరుకుంటాడు చెప్పు?నీ సుఖం కోసం,శాంతికోసం వాడు యెంత తాపత్రయపడుతున్నాడో, నువ్వుకూడా వాడి సుఖంకోసం రవంత ఏదయినా చెయ్యాలి.” “నేనేం చెయ్యనత్తయ్యా?” “వాడిని రెండో పెళ్ళి చేసుకోమను.” రుక్మణి ప్రాణాలెగిరిపోయే దానిలా చూడసాగింది.