Book Description
సంయక్తకి జీవితంలో మొదటిసారిగా రూపాయికున్న విలువ ఎంత అమూల్యమో అర్థం అవసాగింది. అందరూ డబ్బు గురించి మాట్లాడుతుంటే,”వీళ్ళు పిచ్చివాళ్ళు! జీవితంలో ఇంకా చాలా ఆనందాలున్నాయని తెలుసుకోలేని మూర్ఖులు”అనుకునేది. ఇప్పుడు అర్థం అవుతోంది. మనషికి సాటి మనుషులతో సకల మర్యాదలూ,విలువలూ తెచ్చి ఒళ్ళోపడేసే మూలసూత్రం డబ్బు ఒక్కటే. డబ్బు అనే దారంలోనే ఈ సంఘంలో జనాలు బంధింపబడి వున్నారు. సంయుక్త నిట్టూర్చింది. సాగిపోయేది జీవితమా? సాగదీసేది జీవితమా? జీవన విలువలు తెలుసుకుని, జీవితాన్ని ఆస్వాదించేది ఎప్పుడు? నవలా దేశపు రాణి యద్దన పూడి సులోచనా రాణి కలం నుండి జాలువారిన సందేశాత్మక నవల ‘జీవనసౌరభం’ చదవండి!