Book Description
విశాఖపట్టణానికి 30 కి.మీ. దూరంలో సముద్రంలో క్రొత్తగా ఓ దీవి బయటపడింది. దానిని కొంతమంది సుప్రసిద్ధ వ్యక్తులు, ప్రవాస భారతీయులు కలిసి ఒక అద్భుతమైన విహారయాత్రా కేంద్రంగా మార్చేసి ”ప్లెజర్ ఐలండ్” అని పేరుపెట్టారు. తన కుమార్తె ప్రజ్ఞ కోరిక మేరకు ప్రముఖ వ్యాపారవేత్త గజకర్ణం తన కాబోయే అల్లుడు అరవిందుతోపాటు ”ప్లెజర్ ఐలండ్”కు విహారయాత్రకు పంపిస్తాడు. వీళ్ళు బయలుదేరిన స్టీమరులోనే వ్యాఘ్రమూర్తి అనే ఒక ప్రభుత్వ అధికారి, ఆయన గర్ల్‌ఫ్రెండ్ అమృత, ప్లెజర్ ఐలండ్‌లో ఏమైనా అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నాయేమో అని పరిశోధించడానికి జ్ఞానేశ్వరిదేవి అనే ”స్త్రీ సంక్షేమాధికారి” తన స్టెనో మోహన్‌తో కలిసి బయలుదేరుతారు. వీళ్ళుకాక ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయిని అయిన భారతి, ప్రఖ్యాత పాప్‌సింగర్ సుమన్, ఒక పత్రిక నిర్వహించిన పోటీలో విజేతలుగా ఎంపికచేయబడి, ”ప్లెజర్ ఐలండ్” ట్రిప్‌కు బయలుదేరతారు. వీళ్ళందరూ ”ప్లెజర్ ఐలండ్”కు బయలుదేరినప్పటినుంచి జరిగిన సంఘటనల సమాహారమే… యద్దనపూడి సులోచనారాణి అందిస్తున్న చక్కటి రొమాంటిక్ థ్రిల్లర్ నవల ”ప్రేమపీఠం”