Book Description
తెలుగు విందులో వడ్డించిన విస్తరి అమ్మవారి మెడలోని నవరత్నహారపు పతకంలా ఉంటుందట . ఎన్ని రకాలు వడ్డించినా తెలుగువాడి కన్ను ఇంకా దేనికోసమో వెదుకుతూనే ఉంటుందట . "తెలుగుజాతి జిహ్వని తృప్తి పరచడం బ్రహ్మకైన తరమే" అని ఒక మాట. అస్సలీ వంటా వార్పూ అనేది పురుష కళ కాలక్రమంలో అది స్త్రీల చేతుల్లోకి వెళ్ళింది. ఇప్పుడు అది ఇద్దరి చేతుల్లోనించి పోయి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కి వెళ్ళింది. ఎన్ని ఫాస్టు ఫుడ్ సెంటర్ లు వచ్చినా మన చేత్తో వండి వార్చి వడ్డిస్తే ఆ తృప్తే వేరు. అలాంటి తృప్తి కలగాలంటే కాస్తాయిన మనకు వండి వడ్డించడం రావాలి. మరి మనం వంటలు నేర్చకునేదెలా? ఆలోటుని తీర్చే ఉద్దేశంతోనే కథాకథనంలో చెయ్యితిరిగిన నవల సామ్రాజ్యం రారాణి యద్దన పూడి సులోచనారాణిగారి కలంనుండి అనుభవపూర్వకంగా వెలువడిన వంటలు పుస్తకం.