Book Description
సన్నజాజి తీగ నుంచి పూలు ఎంత జాగ్రత్తగా కోస్తున్నా కొమ్మలు విరిగిపోతుంటాయి. అంత సున్నితంగా ఉంటాయవి. మనుషుల మధ్య బంధాలూ అంతే సున్నితం! ఎంత దగ్గర వారితోనైనా చిన్నమాట తేడా వచ్చిందంటే మనస్పర్థలు, మాట్లాడుకోకపోవటం, పట్టుదలలు పెరగటం జరుగుతూ ఉంటాయి. బంధాల కొనసాగంపుకు ఎదుటివారిలోని బలహీనతలను భరించగల సహనం, చక్కని మాటతీరు, ప్రేమించే హృదయం అవసరం. తరిగిపోతున్న బంధాలను అనుబంధాలను గట్టి ప్రయత్నంతో నిలుపుకోవలసిన నేటి అవసరాన్ని ఈ రచన గుర్తుచేస్తుంది. జీవితం సారవంతంగా, ఆనందంగా సాగాలంటే కుటుంబంలోను, సమాజంలోను మనిషికి ఆరోగ్యకరమైన సంబంధ బాంధవ్యాలుండాలని, అప్పుడే ఏ వ్యక్తీ తను ఒంటరినని, తన కోసం చెమ్మగిల్లే నయనం లేదని బాధపడే పరిస్థితి ఏర్పడదని ఈ పుస్తకం స్పష్టం చేస్తుంది. ఇంత విలువైన రచనను పాఠక లోకానికి అందిస్తున్న రచయిత వేంకటేశ్వరరావుగారు అభినందనీయులు.