Book Description
ఆంధప్రదేశ్ సమగ్ర చరిత్ర సంస్కృతులను ఎనిమిది సంపుటాలలో సంకలితం చేసి ప్రచురించడానికి 1998లో ఆంధప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ తీర్మానం చేసింది. ఈ కృషి ఆవశ్యకత ఎంతైనా వుంది. ఏమంటే, ఒక అంతస్సూత్రంలో, ప్రామాణికంగా, కాలక్రమ రీత్యా వివిధ శాఖల దృష్టికోణం నుంచి, ఇప్పటిదాకా అందుబాటులో వున్న సమాచారాన్ని గుదిగుచ్చి వెలువడిన చరిత్ర లేదు. ప్రచురిత గ్రంథాలలో పుష్కలంగా సమాచారం వుంది. ఆంధప్రదేశ్ పురావస్తు శాఖ వారి పరిశోధన పత్రాలు, రాష్ట్రంలోని వివిధ విశ్వ విద్యాలయాల్లోని పరిశోధన పత్రాలు అముద్రితంగానే వుండిపోయాయి. ఆంధ్రదేశ చరిత్ర గురించి జరిగిన కృషిలో ఎక్కువ భాగం రాజకీయ, వంశావళి దృష్టికోణం నుంచే సాగింది; సమాజంలోని విభిన్న అంశాల గురించి, ఆర్థిక సాంస్కృతిక అంశాల గురించి కొన్ని అధ్యయనాలు మాత్రమే జరిగాయి.