Book Description
పద్ధెనిమిదో శతాబ్ది ఆరంభం నుండీ భారతదేశ చరిత్రను సాంప్రదాయిక, వలసవాద, సామ్రాజ్యవాద, జాతీయవాద, మార్క్సిస్టు, అణచివేయబడిన వర్గాల దృక్పథాలలో విశ్లేషిస్తూ అనేక గ్రంథాలు వెలువడ్డాయి. భిన్న శాస్త్రాల నేపథ్యం లోనూ, ఆధునికానంతర దృష్టికోణంలోనూ కూడా అధ్యయనాలు సాగుతున్నాయి. ఫలితంగా కాలక్రమానుగుణమైన రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరమైన ఏకదేశ అధ్యయనాలను దాటి దేశ అభ్యున్నతిని ఇవన్నీ కలిసి ఏ విధంగా రూపుదిద్దాయో తెలుసుకోవడం చరిత్ర అధ్యయనానికి ముఖ్య లక్షణంగా పరిణమించింది. ఈ విధమైన బహుముఖీన అధ్యయనానికి కె.ఎస్.కామేశ్వరరావుగారి ఈ 'భారతదేశ చరిత్ర' ఉదాహరణగా నిలుస్తుంది.