Book Description
తెలుగులో వ్యాకరణాలూ ఉన్నాయి. నిఘంటువులూ ఉన్నాయి. కాని వాటి విస్తృతి చాలాపరిమితం. ఎన్ని నిఘంటువులు కూర్చినా మరో నిఘంటువు ఆవశ్యకత వెనువెంటనే తోస్తుంది. నిఘంటువులు అనేక రకాలుగా ఉంటాయి. మనం సాధారణంగా ఉపయోగించే నిఘంటువు అకారాది క్రమంలో ఉండి అర్థవివరణ ఇచ్చే నిఘంటువు. పర్యాయపద నిఘంటువులూ, నానార్థ నిఘంటువులూ, వివిధ ప్రత్యేక విషయాలు, శాస్త్రాలకు సంబంధించిన నిఘంటువులూ ఉన్నాయి. తెలుగు కవిత్వంలో ముఖ్యంగా పద్యకవిత్వంలో ప్రాస అన్న లక్షణం ఉంది. పద్యపాదంలో రెండో అక్షరం ప్రాస. పద్యం నాలుగు పాదాల్లోనూ రెండో అక్షరం ఒక్కటిగా ఉండడం ప్రాసనియమం. అలాంటి ప్రాస పదాలకు ఉపయోగపడేదే ఈ ప్రాస పద నిఘంటువు.