Book Description
రాష్ట్ర విభజనానంతరం, నా మిత్రులు సౌమ్యంగానూ.. విరోధులు కఠినంగానూ నా మీద చేస్తున్న ఆరోపణ ఒకటే..! 25-1-2013 రాజమండ్రి బహిరంగ సభ మొదలుకుని 20-2-2014 రాజ్యసభలో కూడా రాష్ట్ర విభజన జరిగిపోయేదాకా ఉండవల్లి ఎక్కడ మాట్లాడినా ''బిల్లు పాసవ్వదు'' ''బిల్లు పాసవ్వదు'' అంటూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూనే వచ్చాడు! దీనికేం సమాధానం చెప్తాడు - అని !! దీనికి నేనిచ్చే సమాధానం ఒక్కటే… 'బిల్లు పాసవదు' అన్నాను 'బిల్లు పాసవ్వలేదు' 18-2-2014 తేదిన లోక్‌సభలో బిల్లు పాసయ్యే పరిస్థితే వుంటే, తలుపులెందుకు మూసేస్తారు.. టివి ప్రసారాలను ఎందుకు ఆపు చేస్తారు... ఎంతమంది అనుకూలమో, ఎంతమంది వ్యతిరేకమో.. లెక్క కూడా పెట్టకుండా 'అయిపోయింది' అని ఎందుకు ప్రకటించేస్తారు!? లోక్‌సభలో జరిగిన 'ప్రహసనం' చదవండి.. మీకు అర్థం అవుతుంది, బిల్లు పాసవ్వలేదని...