Book Description
శబ్దరత్నాకరము ప్రామాణికమైన తెలుగు - తెలుగు నిఘంటువు. మద్రాసు బోధనాభ్యసన పాఠశాలలో ఉపాధ్యాయుడూ, గొప్ప పండితుడూ, వైయాకరణుడూ అయిన బహుజనపల్లి సీతారామాచార్యులుగారు ఈ నిఘంటుకర్త. గత వందేళ్లలో తెలుగుభాషలో మరెన్నో కొత్తపదాలు ఏర్పడ్డాయి. అట్లాగే వాడుకలో ఉండి ప్రాచీన కావ్య ప్రామాణిక ప్రయోగాలు కానివి కాని, నిఘంటుకర్త కన్నుగప్పి తప్పించుకొన్నవి కాని పదాలెన్నో ఉన్నాయి. నిఘంటువును ఉపయోగించుకొనే ఆధునికులకు వీటి అవసరమూ ఉంటుంది. అందువల్ల ఈ నిఘంటువులో అటువంటి పదాలను చేర్చడం జరిగింది. దీనివల్ల నిఘంటువుకు మరింత తాజాతనం ఏర్పడింది.