Book Description
అద్వైతమన్నది శంకరులు కొత్తగా కనిపెట్టినది కాదు. అనాదికాలం నుంచి వేదోపనిషత్తులలో నిబిడీకృతమై ఉన్న అద్వైతసిద్ధాంతాన్ని చిలికి వెలికితీసి సమకాలీన సమజానికి అనువైన పద్ధతిలో అన్వయించి చెప్పి బహుజనోపయుక్తంగా చేశారు. ఛండాలునిలో కూడా శివుని దర్శించి పాదాభివందనం చేసిన సంస్కారం ఆయనది. 32 సంవత్సరాలు మాత్రమే జీవించిన అల్పాయుష్కులు శ్రీ శంకరులు. అయితేనేం శతాయుష్కులు శ్రీ శంకరులు. అయితేనేం శతాయుష్కులు అనేకమంది చేయదగు మహత్కార్యాలు చేసి మార్గదర్శనం చేసిన మహనీయుడు. వైదిక ధర్మానికి తాత్త్విక చింతనకు నృత్య సంగీతాది కళలకు ప్రముఖ కేంద్రం కాంచీపురం. భారతదేశంలో గల అయోధ్య, మధుర, కాశీ వంటి ఏడు మోక్షదాయక క్షేత్రాలలో కంచి సుప్రసిద్ధ నగరం. అట్టి కంచిలో వెలసిన కంచికామకోటి పీఠాన్ని అధిష్టించిన ఆచార్య పరంపరలో పరమాచార్య శీశీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి 68వ వారు. అపర శంకరులుగా నడిచే దైవంగా వినుతికెక్కిన యతిలోక చక్రవర్తులు శ్రీ స్వామి. ఆధ్యాత్మిక సాంఘిక రంగాలలో ప్రముఖుల పరిచయాలే మహనీయులు - మహాత్ములు.