Book Description
ధర్మగుబ్ధర్మ కృద్ధర్మ సదసత్ క్షర మక్షరమ్ ।అవిజ్ఞాతాసహస్రాంశుర్విధాతాకృతలక్షణః ।। ధర్మగుప్ : ధర్మాన్ని రక్షిస్తూ, దానిని కాపాడుతూ వుండువాడు విష్ణువు. ఒక పనిని చేపట్టేవాడు ఆపని పూర్తి అయ్యేవరకూ పనిని పదిలం చేసుకుంటాడు. అలాగే ఈ సృష్టి మొదలుకొని లయంవరకూ సమస్త విశ్వాన్నీ నియమబద్ధంగా నడిపిస్తూ వున్నందున ఆ హరి ‘‘ధర్మగోప్త’’. ఈ విశ్వంలో ప్రతిదానినీ పట్టినడిపే శాశ్వతనియమాలు ధర్మాలే. వాటిని కాపాడేవాడు విష్ణువు. ఆహరి ధర్మరక్షకుడు. ఆ శ్రీమన్నారాయణుడు తాను నియమించిన ధర్మవ్యవస్థను తానే రక్షిస్తూ, తనను తానే ఆదర్శంగా చూపిస్తాడు. వృషభగతి రగడలు : ధర్మభావన రక్షజేసే - తరుగురానీ రక్షవిష్ణువె । మర్మమెరిగీ పదిలపరచే - మరియు రక్షకుడతడు విష్ణువె।। విశ్వమంతా పట్టి నడిపే - వినుతమైనా ధర్మనియమమె। విశ్వనియమము తప్పినపుడూ - విష్ణువె వడిరక్షకవచము।। విష్ణు సహస్రనామంలోని ప్రతి శబ్దతత్త్వాన్ని తెలుసుకోవటం, దాన్ని వ్యాఖ్యానించటం, రగడలో బంధించటం అనే మూడు కార్యాల్ని త్రికరణశుద్ధిగా చేసినట్లు ఈ గ్రంథాన్ని చదివితే తెలుస్తుంది.