Book Description
బాలి గీసిన శ్రీను చిత్రం. ఔను...నిజంగా ఇది చిత్రమే. ఈనాడు ప్రారంభం విశాఖలో 1974, నిజం, శ్రీను, మారెమండ సీతారామయ్య గార్లతో నేను సబ్ ఎడిటర్‌గా ఉన్న రోజులవి. బాలి గారు నీటిపారుదల శాఖలో పనిచేస్తుంటే ఎడిటర్ ఏబీకే గారు ఈనాడు కార్టూనిస్ట్‌గా వారిని తీసుకున్నారు. అంతవరకు ముఖచిత్రాల కళాకారుడుగా ఉన్న బాలి కార్టూనిస్ట్‌గా మారారు. బాలి గారికి పురాణం సుబ్రహ్మణ్యశర్మగారంటే గౌరవం ఆ ప్రేమతోనే శ్రీనివాసశాస్త్రిగారిని తన ఇంట్లోనే ఉండమన్నారు. అలా ఆ ఇద్దరి మధ్య ఆత్మీయత పెరిగింది. అలాంటి బాలి, శ్రీను స్వర్గస్థుడయ్యాక గొప్పగా ఈ బొమ్మ గీసి, కొన్ని నెలలకే మిత్రుని చేరుకోవడం నిజంగా చిత్రమే