Book Description
‘బ్రదర్స్ కరమజోవ్’ లాంటి నవలను చదివి ముగించినప్పుడు పాఠకుడి మనస్థితి తుఫానువచ్చివెళ్ళిపోయిన తరువాతి గదిలా ఛిన్నాభిన్నమైపోయి వుంటుందని యి.యెం.ఫాస్టర్ అభివర్ణిస్తాడు. ఆ గదిలోని కుర్చీలూ, బల్లలూ అన్నీ విరిగి పడిపోయి వుంటాయి. యేదీ ముందున్నచోటులో వుండదు. పాఠకుడి మనస్సులో యిదివరకూ వున్న నమ్మకాలూ, అభిప్రాయాలూ, జ్ఞాపకాల లాంటివన్నీ అలాగే విరిగి, నలిగి, క•లిపోయి వుంటాయి. యింత చెప్పినా ఆ అనుభవమెలా వుంటుందో అవగతం గాదు. వోసారి బుద్ధిగా, శ్రద్ధగా, వినయంగా నవలను చదివినవాళ్ళకుమాత్రమే ఫాస్టరేమని చెప్పాడో అర్థమవుతుంది.ద