Book Description
లంకాయం శాంకరీదేవి - కామాకీ కంచికాపురే, ప్రద్యుమ్నే శృంఖలాదేవి - చాముండీ క్రౌంచపట్టణే! అలంపురీ జోగులాంబా - శ్రీశైలే భ్రమరాంబికా, కొల్హాపూరే మహాలక్ష్మి - మహూర్యే ఏకవీరికా।। ఉజ్జయిన్నాం మహాకాళీ - పీఠికాయాం పురుహూతికా, ఓధ్యాయాం గిరిజాదేవి - మాణిక్యా దక్షవాటికే! హరిక్షేత్ర కామరూప - ప్రయాగే మాధవేశ్వరీ, జ్వాలాయాం వైష్ణవీదేవి - గయా మంగళ్య గౌరికా।। వారణస్యాం విశాలక్షీ - కాశ్మీరేతు సరస్వతి... సర్వసృష్టికి మూల రూపిణి ‘‘ఆదిశక్తి’’. ఆమె పాదరేణువుల నుంచే ఈ బ్రహ్మాండమూ, జీవరాశి, పర్వతాలు, నదులు, చెట్లు, చేమలు మొదలగు సమస్తమూ ఆవిర్భవించాయి. ఈ సృష్టి అంతా ఆమె స్వరూపమే. అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళము, భూర్భవ, స్వర్గలోక, సువర్శహర్జన, సత్యలోక, తపోలోక, ఊర్థ్వ, పాతాళ, జనలోక మొదలగు పదునాల్గు లోకాలు కలిస్తే బ్రహ్మాండం అవుతుంది. ఇటువంటి అనంతకోటి బ్రహ్మాండంనకు మాతృకశక్తి ‘‘ఆదిపరాశక్తి’’. అష్టాదశ శక్తిపీఠాల చరిత్ర, స్థలపురాణము, యాత్రాదర్శిని వివరణ.