Book Description
మనది వేదభూమి. సంస్క•తి, ధర్మం, జీవనం, మతం మొదలగు వాటికి వేదమే ప్రమాణం. హిందూమతం నుంచి శైవం, వైష్ణవం, శాక్తేయం మొదలగునవి ఏర్పడ్డాయి. శివారాధన ప్రాముఖ్యత కలిగిన భక్తి మార్గాన్ని ‘‘శైవం’’ అని అంటారు. శివుని ప్రతిరూపంగా శివలింగాన్ని కొలుస్తారు. వేదవ్యాసుడు రచించిన అష్టాదశ పురాణాలలో శివపురాణం ఒకటి. మత్స్య పురాణం మినహాయించి మిగిలిన పురాణాల్లో శివపురాణం గురించి చెప్పబడింది. వేదములు శివుని అవ్యక్తుడుగా పేర్కొన్నాయి. శివ పదమునకు కళ్యాణ దాతయని, మంగళ స్వరూపుడని అర్థములున్నాయి. భారతదేశంలో క్రీ।।శ।। 4వ శతాబ్ధం తరువాత బౌద్ధ, జైన మతములు స్థిరపడినాయి. వాటివలన హిందూమతంనకు గొప్ప దెబ్బతగిలింది. శైవంకు పునఃవైభవం తెచ్చుటకు నయనార్లు (శివభక్తులు) శైవ సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. శైవాచార్యుల ప్రోత్సాహంతో ఆనాటి రాజులు తిరిగి శైవంను గౌరవించినారు. వీరు అనేక శివలింగాలను ప్రతిష్టించి, పెక్కు ఆలయాలు నిర్మించారు. ‘‘సుప్రసిద్ధ శివాలయాలు’’ అను పుస్తకం నందు కొన్నింటిని పొందుపర్చితిమి. వీటితోపాటు శివపరివారం నకు సంబంధించిన ఆలయాలు కూడ జత చేసియున్నాము