Book Description
అవును. నిజంగా ఇది ఒక సాగరమే. ఆద్యంతాలు లేని ఒక మహాసాగరం. ఒక శాంత మహాసముద్రం. కనుమూసినా తెరచినా అంతర్ బహిర్ చక్షువులకు గోచరమయే ఒక శాంత గంభీర శరధి! హృదయమంతా పరుచుకుపోయే ఒక శరత్ చంద్రికా వీచిక. అసలు ధ్యానం అంటే ఏమిటి? ‘‘నిశ్చల చిత్తముతో భగవంతుని గూర్చి తలచుట, లేక చింతించుట’’ అని మన నిఘంటువు అర్థం చెబుతోంది. కాని, అసలు అర్థం అది కాదు. మనోసాగరపు చెలియలికట్టవద్ద - తీవ్రఘోషతో, విరుచుకుపడే ఉత్తుంగభరిత ఆలోచనా తరంగాలతో కల్లోలితమై విలవిలలాడే మనసును - దూరంగా - కల్లోలరహితమై పిల్లకెరటాల మధ్య నిశ్చలంగా నిలిచివున్న క్షితిజరేఖ వైపుగా తీసుకువెళ్ళి స్వాంతనపరచే ఒక అద్భుత పక్రియయే ఈ ధ్యానయోగం. పాఠకులు, ధ్యానాభిలాషులు చదివి ఆచరించగలరు.