Book Description
భక్తి అంటే ఏమిటి? హిందూ ధర్మమంటే ఏమిటి? మొదలైన విషయాలు అందరికీ తెలిసినట్లే ఉంటాయి కాని, ఏమిటంటే చెప్పడం కష్టం. ఇటువంటి విషయాలను సశాస్ర్తీయంగా వివరించడానికి ప్రయత్నించారు. ఇందులో ‘గుడిలో గంటలు ఎందుకు ఉంటాయి? ఒక హిందూపూజారికి ఉండవలసిన గుణాలు, లక్షణాలు ఏమిటి?’ మొ..న శీర్షికలను 70కి పైగా ఎన్నుకొని వాటిని విశదమైన శైలిలో సరళభాషలో సవివరంగా రచించి సనాతన హిందూ సంప్రదాయాలయెడ భక్తి, వినమ్రత, విధేయత కలిగించడానికి ప్రయత్నించారు. ప్రతి ఒక్కరు ‘భక్తి అంటే’ అనే పుస్తకాన్ని తప్పక చదివి తమ సంశయాలు తీర్చుకొనవచ్చు. శ్రీ మంజులశ్రీ కుంకుమోద్యమ నిర్మాతయే కాక తులసి సేవను గురించి విసృత ప్రచారం చేస్తున్నారు. ఆలయసేవ, శ్రీక్రియ మొదలయిన వాటిని గురించి ప్రచారం చేస్తూ సమాజంలో భక్తి భావాన్ని ఇనుమడింప జేయడంకోసం పాటుపడుతున్నారు శ్రీ సేవా ఫౌండేషన్, శ్రీ పబ్లికేషన్స్ నిర్వహణా కర్త, ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ‘‘తిరుప్పావై కోకిల’’ మంజులశ్రీ గారు. ప్రతి ఒక్కరు చదివి సనాతన హిందూధర్మ సంప్రదాయాలను గురించి అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ పుస్తకం.