Book Description
‘‘అమ్మ పాదాల చెంతనే స్వర్గం ఉంది’’ అంటుంది ఇస్లాం ధర్మం. ‘‘మానవత్వమే మతం’’ అంటుంది అంతర్వాణి. ‘‘అందరూ నా బిడ్డలే’’ అంటుంది దేశం. ఈ భావాల పునాదులమీద చేయబడిన విశిష్ఠమైన, మత సామరస్య రచన ‘అమ్మీజాన్’. నలభై వారలకు పైగా ‘గీటురాయి’ వార పత్రికలో వెలువడి పాఠకుల ప్రశంసలందుకున్న ధారావాహిక నవల. కాటూరు రవీంద్ర త్రివిక్రమ్ కలం నుండి వెలువడిన కమనీయ జీవన కావ్యం.