Book Description
‘జీవని’ అంటే జీవింపజేయునది. మనిషి తను సుఖసంతోషాలతో జీవించడానికి అన్ని పాట్లూ పడతాడు. కానీ, ఎదుటివారిని ఆనందింపజేయడానికి, ఆపదలో ఆదుకోవడానికి ఆసక్తి చూపడు. ఎంత ధైర్యవంతులైనా, చివరకు డాక్టర్లయినా ప్రాణ సంకటంలో పడితే భయం గుప్పిట్లో బిగుసుకుపోతారు. ఈ నవలలో డాక్టర్ చందన బ్రెస్ట్ క్యాన్సరు వ్యాధికిలోనవుతుంది. ఆమె టెన్నిస్‌స్టార్ స్టెఫీగ్రాఫ్ని ‘రోల్‌మోడల్’గా తీసుకుని మంచి క్రీడాకారిణిగా ఎదుగుతున్న సమయంలో ఈ ఆపదకి గురవుతుంది. యువరాజ్సింగ్ని ఆదర్శంగా తీసుకుని ధైర్యంతో వ్యాధిని ఎదుర్కొంటుంది. అంతిమ విజయం ఎవరిది? సస్పెన్సుతో, సందేశాత్మకంగా, కుతుహలంతో చివరివాక్యం వరకు ఆపకుండా చదివించే అద్భుత నవల.