Book Description
‘‘సంభవామి యుగే యుగే’’ అన్నట్లు ప్రతిదేశంలోను ఏదో ఒక దశలో ఎదురయ్యే సమస్యలు పరిష్కరించి దేశానికి తరుణోపాయం చూపేందుకన్నట్లు కొంతమంది మహావ్యక్తులు జన్మిస్తారు. ఉదాహరణకు ఐర్లాండులో డీవెల, జర్మనీలో బిస్మార్క్, ఇటలీలో గారిబాల్డీ, రష్యాలో లెనిన్, స్టాలిన్, చైనాలో సన్‍యాట్‍సేన్, మావో జన్మించి వారి దేశచరిత్రనే కొత్తమలుపు తిప్పి జాతి ఔన్నత్యాన్ని పెంపొందించారు. అదే విధంగా మనదేశంలో స్వామివివేకానంద, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, రాజా రామమోహనరాయ్, కందుకూరి వీరేశలింగం లాంటి మహాపురుషులు జన్మించి జాతిని సామాజిక పతనంనుండి రక్షించారు. భారతజాతి పరదాస్యమునుండి విముక్తికై అన్నట్లు ఎందరో మహానుభావులు ఈ గడ్డపై ఉద్భవించి స్వాతంత్య్ర సముపార్జనకై ఎంతగానో కృషిచేసి భారతదేశచరిత్రలో ఒక నూతన శకారంభానికి నాందీ వాచకం పలికారు. వారే మన స్వాతంత్య్ర సమరయోధులు.