Book Description
భారతదేశానికి ఆయన వ్యక్తిత్వం ఎవరెస్టు శిఖరం. ప్రపంచానికి ఆయన మేధాసంపన్నత కలికితురాయి. ‘‘మేధావులకు ఉపాధ్యాయుడు’’ అన్నారు ప్రపంచ మేధావులు. ‘‘ఉపాధ్యాఉలలో మేధావి’’ అన్నారు ఉపాధ్యాయులు! ‘‘గురువులలో బ్రహ్మ’’ అన్నారు విద్యార్థులు! ‘‘మహాపురుషుడు’’ అన్నది కాలం. ఆయన ఎవరో కాదు. సర్వేపల్లి గ్రామం నుంచి వలస వెళ్లిన కుటుంబంలో తిరుపతి సమీపంలోని తిరుత్తణి పుణ్యక్షేత్రంలో పుట్టిన ఆంధ్రుడు సర్వేపల్లి రాధాకృష్ణన్. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థుల పట్ల ఎలా ఆలోచించాలో ఆ బాధ్యతని సక్రమంగా నెరవేర్చగలిగితే ఈ ప్రపంచం అట్టి అధ్యాపకునికి ఎలా నీరాజనాలు పడుతుందో నిరూపించే కథ ఆయన జీవితం! ఆయన బోధనలనించే కాదు, ఆ మహనీయుని జీవితం నించి కూడా ప్రపంచం నేర్చుకోవలసింది ఎంతో వుంది.