Book Description
మానవ జన్మనెత్తిన తర్వాత ప్రతి మానవుడు నాకు సుఖము కావాలి దుఃఖం వద్దని కోరుకుంటాడు. మానవునికి సుఖము రెండు రకాలుగా ఉంటుంది. 1) తాత్కాలికము 2) శాశ్వతము. తాత్కాలికమైన సుఖమును అల్పబుద్ధులు కోరుతారు. బుద్ధిమంతుడు శాశ్వత సుఖాన్ని కోరుతాడు. సకల జనులు సుఖ - సంతోషాలతో, ఆనందానుభూతులతో ఉండటానికి కావలసిన మార్గాల గురించి చాలా ప్రాచీన కాలం నుండి పరిశోధనలు జరుగుచున్నాయి. నాటి కాలంలో పరిశోధనలన్నీ ఆధ్యాత్మిక మార్గంలోనే సాగేవి. అలాంటి పరిశోధనా మార్గాల్లో ఒకటి ‘యోగము’ యోగమును గూర్చి మొదటగా చెప్పినది శ్రీకృష్ణభగవానుడే. ఆయన పార్ధునకు హితబోధ చేస్తు గీతలో ఆరవ అధ్యాయమున చాలా విశదముగా యోగమును గూర్చి ఉపదేశించినాడు. యోగము లెన్నియో గాని లక్ష్యమొక్కటే. దారులెన్నియైన దైవమొక్కటే. హఠ యోగ సాధన చేత శరీరాన్ని మనస్సునూ శుద్ధిచేసి, తద్వారా పరమాత్మలో ఆత్మను విలీనం చేయటమే యోగా పరమార్థమని గ్రహించాలి. ఇక హఠయోగ సాధన మానవునికి ఆరోగ్యమును, సంపూర్ణ ఆయువునూ ఇవ్వగలదు.