Book Description
ఐదు శతాబ్దముల క్రితముశ్రీ స్వాత్మారామ యోగివర్యులచే సంస్కృత భాషలో వ్రాయబడిన ‘‘హఠయోగ ప్రదీపిక’’ గ్రంథమును పఠనయోగ్యమైన చక్కని తెలుగు భాషలోనికి అనువ దించిన యోగాచార్య సంపత్‍కుమార్‍గారు అభినందనీయులు. మూల గ్రంథములోని శ్లోకములను సంస్కృత లిపిలోను, తెలుగు లిపిలోను ముద్రించటం వాటిని సవివరంగా తేట తెలుగులోనికి అనువదించటం, వివిధ ప్రాచీన గ్రంథాల నుండి సారూప్యత గల శ్లోకాలను అందించటం, ప్రధానంగా ఫోటోలతో సహా యోగ పక్రియలను ప్రదర్శించటం అద్భుతంగా ఉన్నది. ప్రతీ భారతీయుడూ చదవదగినది ఈ గ్రంథము.