Book Description
సమాజ ఆరోగ్యం... దేశ ఉన్నతికి, అభివృద్ధికి మూలం... సమాజానికి మూలం కుటుంబం.... కుటుంబం... అంటే... చిన్నారులు ముఖ్యం... చిన్నారులు ఆరోగ్యంగా... ఆనందంగా ఉంటే అది మంచి బాల్యం... బాల్యం ఆనందంగా... స్మ•తులని పదిలంగా మదిలో ఉంచుకున్న వ్యక్తి దేశానికి, సమాజానికి ఉపయోగపడే వ్యక్తి కాగలడని చరిత్ర చెబుతుంది. మంచి బాలలు... ఆనందంగా... ఆరోగ్యంగా ఉంటే... దేశానికి అదే బలం.... జయం... మా తరం కన్నా... మా పెద్దల తరం మంచి ఆరోగ్యాన్ని అనుభవించారు... మా తరం కన్నా మా పిల్లల తరంలో అభివృద్ధి, అవకాశాలు కోకొల్లలు... కానీ ఒత్తిడితో చిత్తయి మాదకద్రవ్యాలకు బానిసలయ్యే బాలలు... ఆరోగ్య సమస్యలతో... ఉక్కిరి బిక్కిరి అవుతున్న చిన్నారులు.. చదువులతో తల్లడిల్లుతూ ప్రాణాలు పణంగా పెడుతున్న విద్యార్ధులు... ఈ దేశ భావితరం... అమాయకంగా... విషాదంగా...కన్పిస్తూ ఉంటే... మూలకారణాలు ఏమిటి? అని శోధించి... సాధించిన ఫలితాలు ఈ పుస్తకంలోని వివరణలు...విశ్లేషణలు... పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే... ఈ పుస్తకంలోని కొన్ని ఆరోగ్యసూత్రాలు ఆచరించడం... అత్యవసరం... విశ్వ ఆరోగ్యం కోసం... విశ్వ శ్రేయస్సుకోసం... మన పిల్లల... ఆరోగ్యంకోసం... ఆయుర్వేదం....