Book Description
విజయవాడ రాజధాని అయిన నేపధ్యంలో... ప్రజలకు వస్తున్న ఆరోగ్య సమస్యలకి ఆయుర్వేదపరముగా మంచి ఫలితాలను ఇవ్వగలం అన్న సంకల్పముతో... మా డాక్టర్గారు ఓ పెద్ద ప్రణాళికతో ‘‘సుఖీభవ’’ అనే మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ పెట్టుకుని... చాలా తక్కువ ఖర్చుతో రకరకాల వైద్యపరీక్షలు చేస్తూ ‘‘సామాన్యుడికి అందుబాటులో మంచివైద్యము’’ అందించే వెల్నెస్ సెంటర్ను స్థాపించారు. ‘‘సుఖాయు’’ ఆయుర్వేద పెయిన్ అండ్ పెరాలసిస్ వైద్యాలయం ఫిబ్రవరిలో డా।। ఎమ్. జె నాయుడుగారి చేతులు మీదుగా ప్రారంభింపచేశాం. ‘‘సుఖమైన ఆయువు’’ ను ప్రజలకు ఇవ్వాలని మా సంకల్పము. అన్నిబాధలలోనూ ‘‘నొప్పి’’ చాలా తీవ్రమైన వేదన కాబట్టి ఆ ‘‘నొప్పి’కి పరిష్కారం ఇచ్చేలా ‘‘సుఖాయువు’’ స్థాపించబడినది. ‘‘సుఖాయు’’"Spine & Pain" వైద్యాలయం కాబట్టి ప్రజలకు ‘‘నొప్పి’’ గురించిన అవగాహన కలిగించే ఉద్దేశ్యముతోనూ, మంచి ఫలితాలను గత 30 సంవత్సరాలుగా ఇస్తున్న అనుభవమును క్రోడీకరించి ఎలాంటి నొప్పిని అయినా తగ్గించగలముఅనే అవగాహన కలిగించడం కోసం... నొప్పికోసం వాడిన మందుల వలన సైడ్ ఎఫెక్టుల వలన వస్తున్న రకరకాల రుగ్మతలను కూడా ఆయుర్వేద పంచకర్మ వైద్యమువలన తగ్గించగలుగుతున్నాముఅనే సందేశముతో సుఖాయు ‘‘స్పెయిన్ &పెయిన్’’ పుస్తకం వ్రాయాలి అనే సంకల్పం కలిగింది.