Book Description
మన జీవన వేదం ఆయుర్వేదం.. ఆరోగ్యానికి మూలం ఆయుర్వేదం. ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు నాటితరం.. ఆరోగ్య మహాభాగ్యం అన్నారు నాటితరం... ఆర్థిక భాగ్యం.. ఆహార భోగం.. కోసమే అంటున్నారు నేటితరం.. అందుకే ఇంత అనారోగ్యం.. రోగాలకి మూలకారణం చెప్పి చికిత్స చేస్తుంది ఆయుర్వేదం.. ఏ వ్యాధికైనా సరైన కారణం చెప్పి చక్కగా అమ్మలా నయం చేస్తుంది ఆయుర్వేదం.. ఆరోగ్యం అంగట్లో దొరికేది కాదు. ఆరోగ్యసూత్రాలు ఆచరించడం ఆరోగ్యానికి సోపానం.. నేడు మనం కన్నతల్లినీ మరిచాం.. ఉన్న ఊరునీ మరిచాం.. ఇంకా ఆయుర్వేదం మరిచాం.. మన సాంప్రదాయం వదిలాం.. ధ్యాన సంపన్నులు... మహర్షులు.. ఆయుర్వేదం ఆచరించారు. మనకోసం అందించారు. ఇప్పుడు మళ్ళీ మనం తెలుసుకుందాం...ఆ జీవన వేదం... అన్నీ చక్కగా ఆచరిద్దాం. మళ్ళీ ఆరోగ్యాన్ని పొందుదాం... ఆయుర్వేదం అభ్యసించడం వైద్యులకు పూర్వజన్మ పుణ్యం.. ద్విజత్వం ఆయుర్వేదం... రోగులకు అందించడం ఓ పుణ్యకార్యం... ఈ పుణ్యకార్యంలో మేము కూడా ఉండటం మా అదృష్టం.. ఆరోగ్యం... మనందరికీ ఓ మహాయోగం... మహాయాగంలో అందరం అవుదాం భాగస్వాములం... మంచి ఆరోగ్యం పొందడం భగవత్ప్రసాదం.. ఆ ధన్వంతరీ ఆరోగ్య కృపకు పాత్రులవుదాం.. సర్వే సంతు నిరామయః.