Book Description
పోలీసులు ఇంతవరకూ యీ సెన్సేషనల్ కేసుల్లో ఏదీ తేల్చలేకపోయారు. ఇంద్రజిత్! మీరు కేసులు చేపట్టిన తర్వాత కూడా పోలీసుల యిమేజ్ దెబ్బతింటున్నది. యీ పరిణామం మాకెంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది’’ ఒక ప్రముఖ ఇంగ్లీషు పత్రిక జర్నలిస్టు ప్రశ్నించాడు. ఆ జర్నలిస్టుకు తను చాలా తెలివిగా ప్రశ్నలు వేసే నైపుణ్యం వుందని అనుకుంటుంటాడు. ‘‘నేను కూడా అందరిలాంటివాడినే - మీరే నాకేదో ప్రత్యేకత వుందన్న యిమేజ్ యిచ్చారు. నేను ఎప్పుడూ టీంవర్క్ వల్ల సాధించిన విజయాలను నిర్మొహమాటంగా మీ ముందు ఒప్పుకున్నాను ఎన్నోసార్లు. పోలీసు ఇమేజ్ అనేది పరిస్థితుల ప్రభావాల మీద ఆధారపడి వుంటుంది. ఎన్నో జటిలమైన కేసులు పరిష్కరించి సాధించుకున్న యిమేజ్ ఒక్క సెన్సేషనల్ కేసు పరిష్కరించలేకపోతే - మొత్తం పోవచ్చు. అందువల్ల మేము యిమేజ్‍నే గీటురాయిగా తీసుకొని పనిచేయాల్సిన చట్రంలో యిరుక్కోగూడదు.’’ నిజాయితీ కంఠంలో తొణికిసలాడుతుండగా చెప్పిన ఆ జవాబు కాసేపు అందరిలో నిశ్శబ్దం ఆవరించేట్లు చేసింది. ఇన్వెస్టిగేషన్ ఆధారంగా రాసిన ఈ నవల మిమ్మల్నందర్నీ అలరిస్తుంది...